వారానికి మూడుసార్లు చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది: రకుల్

By సుభాష్  Published on  23 May 2020 11:05 AM GMT
వారానికి మూడుసార్లు చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది: రకుల్

రకుల్‌ ప్రీత్‌.. ఈపేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందరికి తెలిసిందే. 'కెరటం' మూవీతో పరిచయమైన ఈ భామ ఆ తర్వాత తన అందంతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. స్టార్‌ హీరోల సరసన నాటిస్తూ అదరగొట్టింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్యన తెగనటించిన కొన్ని సినిమాలు తుస్సుమనడంతో అవకాశాలు కాస్త తగ్గిపోయాయి.

దీంతో రకుల్‌ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ కారణంగా ఎలాంటి షూటింగ్‌లు అన్ని నిలిచిపోవడంతో ఈ భామ ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఎలాగో షూటింగ్‌లు లేవు కదా.. ఇంట్లోనే ఉంటున్నందుకు రోజుకు 108 సార్లు సూర్యనమస్కారాలు చేస్తోందట ఈ ముద్దుగుమ్మ. అంతేకాదండోయ్‌.. 108 సార్లు వారంలో రెండుసార్లు చేస్తోందట. ఇలా నెమ్మదిగా సూర్యనమస్కారాలు చేయడం వల్ల నాకెంతో హాయిగా ఉంది.. మనసుతో పాటు శరీరం కూడా చాలా చలాకిగా, ఉత్సాహంగా తయారైంది... అని చెబుతూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో వదిలింది. ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ భామ తెలుగులో నితిన్‌ సరసన చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్‌-2లో సినిమాలో నటిస్తోంది. మరో వైపు హిందీలో అర్జున్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఓ రొమాంటిక్‌ కామెడీలో కూడా నటిస్తోంది. కాస్త అవకాశాలు తగ్గినా.. మళ్లీ అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Next Story