ఇంకా పొంచి ఉన్న మిడతల దండు ముప్పు‌ : శబ్దాలు చేయండి.. తలుపులు, కిటికీలు మూసేయండి  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jun 2020 4:28 AM GMT
ఇంకా పొంచి ఉన్న మిడతల దండు ముప్పు‌ : శబ్దాలు చేయండి.. తలుపులు, కిటికీలు మూసేయండి  

గురుగ్రామ్ కు మిడతల ప్రమాదం ఇంకా పొంచే వుంది. పంటలను నాశనం చేసే మిడతలు ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. హర్యానా జిల్లాలో మిడతల దండు కనిపించాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వీలైనంత గా శబ్దాలు చేసి వాటిని తరిమికొట్టాలని కోరారు.

మహేంద్ర గఢ్ జిల్లాను మిడతలు చేరుకున్నాయని.. అతి తక్కువ సమయంలో రేవారి సరిహద్దు ప్రాంతానికి అవి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా గురుగ్రామ్ వాసులకు అధికారులు పలు సూచనలు ఇచ్చారు. తలుపులు, కిటికీలు మూసి వేసి ఉంచాలని కోరారు. రైతులు క్రిమిసంహారకాలు రెడీగా చేసుకోవాలని కోరారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని.. గ్రామస్థులకు మిడతల దాడి గురించి తెలిసేలా చేయాలని అధికారులు కోరారు.

ఈ రాకాసి ఎడారి మిడతల దండు ఇప్పటికే పశ్చిమ, మధ్య భారత దేశాలపై దాడి చేసి ఎన్నో ఎకరాలలో పంటలను నాశనం చేశాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలపై మిడతల ప్రభావం ఉంది. మొత్తం 11 కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ మిడతల గుంపులపై నిఘా పెట్టారు. ఈ మిడతలు ఆఫ్రికా నుండి ఇరాన్, పాకిస్థాన్ మీదుగా భారత్ లోకి వచ్చాయి. అడ్డు వచ్చిన చెట్లను, పంటలను ఈ మిడతలు పూర్తిగా తినేస్తూ ఉంటాయి.

Next Story
Share it