తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ దర్శించుకున్నారు. ముందుగా ద్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లేందుకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరుగు పయనం అయ్యారు. మంత్రి వెంట మాజీ టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు కూడా ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వేద ఆశీర్వచన మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం పలికిన అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.