తిరుమలలో శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. తమను సరిగా దర్శనం చేసుకోనివ్వకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బంది తమను తోసేశారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన తమను బంగారు వాకిలి నుంచే వెనక్కి పంపేశారంటూ భక్తులు నిరసన తెలిపారు. రూ.11 వేలు పెట్టి టికెట్టు కొన్న తమను దర్శనం చేసుకోనివ్వకుండా.. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది వేగంగా బయటకు తోసివేశారని భక్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బందితో శ్రీవాణి ట్రస్ట్ భక్తులు వాగ్వాదానికి దిగారు.
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం నుంచి పది రోజుల పాటు భక్తులకు వెకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా తొలుత తిరుపతిలోని స్థానికులకే వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించినా.. క్యూలైన్లలో నిల్చున్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు అందజేసింది.