అప్పుడు ముంతకింద చింతపండు.. ఇప్పుడు టిక్‌టాక్ వీడియో..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Jun 2020 1:10 PM GMTఅలీబాబా.. నలభై దొంగలు కథ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదూ. ఇంచుమించు ఈ కథ కూడా అలాంటిదే. అలీబాబా.. నలభై దొంగల కథలో అలీబాబా, తమ్ముడు కలిసి కట్టెల కోసం అడవికి వెళ్లగా.. అక్కడ నలభై మంది దొంగలు దోచుకున్న సొమ్మును గుహలో దాచిపెట్టడం తమ్ముడు చూస్తాడు. కానీ ఆ విషయం అన్నకు చెప్పకుండా.. తెలివిగా గుహలోకి ప్రవేశించి దొంగలు దాచిపెట్టినదానిలో తనతో తెచ్చుకోగలిగినంత సొమ్మును తీసుకుంటాడు. ఇంటికొచ్చాక ఆ సొమ్మును కొలిచేందుకు.. ఓ ముంత అవసరం అవుతుంది. వదిన దగ్గరకెళ్లి ముంత కావాలని అడుగగా.. వీళ్లేదో కొలవడానికి ముంత అడుగుతున్నారని అనుమానమొచ్చి ముంత కింద చింతపండు అతికించి ఇచ్చింది. ఆ చింతపండే అన్న అలీబాబాకు చేటు చేసింది.
తమ్ముడు వదిన నుంచి తీసుకున్న ముంతతో బంగారు నాణేలను కొలిచి తిరిగి ముంతను వదినకిచ్చాడు. ఆ ముంతకింద అతికించిన చింతపండుకి ఒక బంగారు నాణెం అతుక్కోవడంతో ఆవిషయం భర్తకు చెప్పింది. అత్యాశతో కొన్ని గాడిదలను వెంటతీసుకుని గుహలోకి వెళ్లిన అలీబాబా అక్కడున్న సొమ్మును ఎలా తీసుకెళ్లాలో అర్థంకాక అయోమయంలో.. గందరగోళంలో పడి గుహనుంచి బయటికొచ్చేందుకు కావాల్సిన పాస్ వర్డ్ ను మరిచిపోయాడు. ఈలోగా గుహలోకి వచ్చిన దొంగలు అలీబాబాను పట్టుకుంటారు.. ఈ కథ ద్వారా దురాశ దుఃఖానికి చేటు అన్న నీతిని నేర్చుకున్నాం.
ఇప్పుడు టిక్ టాక్ లో దొరికిన ఆ దొంగ కథ కూడా ఇంతే.. ఇటీవల కాలంలో అస్సాంలోని ఓ ఇంట్లో దొంగలు పడి డబ్బు, నగలు అన్నీ దోచుకుపోయారు. ఆ ఇంటి యజమానులు కేసు పెట్టారు గానీ.. పోలీసులకు ఎంత వెతికినా అసలు దొంగలు దొరకలేరు. ఎంతదొంగలైనా ఎక్కువరోజులు దోచుకున్న సొమ్మును దాచిపెట్టలేరు కదా. ఆ సొమ్మంతా దోచుకుపోయిన ఓ మహిళ టిక్ టాక్ లో ఖరీదైన నగలు, బట్టలు కట్టుకుని కనిపించింది. ఈ వీడీయో పోలీసుల కంట పడటంతో పోయిన నగలు తాలూకా ఫొటోలను ఆ వీడియోలో మహిళ వేసుకున్న నగలను పోల్చి చూశారు. ఇంకేముంది.. అసలు దొంగ దొరికేసింది.