నరేంద్ర మోదీపై నమ్మకం ఉంచిన 65శాతం మంది.. నంబర్ వన్ సీఎం ఎవరంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 12:39 PM GMT
నరేంద్ర మోదీపై నమ్మకం ఉంచిన 65శాతం మంది.. నంబర్ వన్ సీఎం ఎవరంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ పై 65శాతం భారత ప్రజలు నమ్మకాన్ని ఉంచారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రుల లిస్టులో బెస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పారు.

తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. రాహుల్ గాంధీ కంటే మోదీనే తమ ఫేవరెట్ అని తెలిపారు. సర్వేలో దాదాపు 66.2 శాతం మంది మోదీకే తమ మద్దతు అని చెప్పగా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ వైపు 23.21 శాతం మొగ్గు చూపారు. సర్వేలో 58.36 శాతం మంది మోదీ పనితీరుపై 'చాలా సంతృప్తి' చెందామని అన్నారు. 24.04 శాతం మంది కొంత వరకూ సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. 16.71 శాతం మంది తమకు ఆయన తీరు సంతృప్తికరంగా లేదని చెప్పారు.

ఇక కొన్ని రాష్ట్రాల ప్రజలు మోదీ పని తీరును చాలా బాగా మెచ్చుకున్నారు. ఒడిశాలో మోదీ పరిపాలకు 95.6 రేటింగ్ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ 93.95, ఛత్తీస్గర్ 92.73 రేటింగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో 83.6, తెలంగాణలో 71.51 రేటింగ్ వచ్చింది. దక్షిణ భారతదేశానికి చెందిన తమిళనాడు 32.89 రేటింగ్, కేరళ 32.15 మాత్రమే రేటింగ్ ను ఇచ్చింది.

ఉత్తమ ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్‌కే ప‌ట్టం:

ఉత్తమ ముఖ్యమంత్రి రేసులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఛత్తీస్గర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ లు బాగా పోరాడారు. నవీన్ పట్నాయక్ కు 82.96 శాతం రేటింగ్ రాగా.. భూపేష్ భగేల్ ను 81.06 శాతం మెచ్చుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను 80.28 శాతం మెచ్చుకోగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితీరుపై 78.01 శాతం ప్రశంసలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేవలం 54.22 శాతం మాత్రమే రేటింగ్ వచ్చింది.

కేంద్రప్రభుత్వ పని తీరును 90శాతం పైగా మెచ్చుకున్న రాష్ట్రాలు మూడు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ 97.46 శాతం, ఒడిశా 95.73 శాతం, ఛత్తీస్గర్ 91.42 శాతం మెచ్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 78.65 శాతం కేంద్రపనితీరును మెచ్చుకున్నారు. తెలంగాణలో కేవలం 68.96 శాతం మాత్రమే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును ఇచ్చారు. మొత్తంగా 62శాతం కేంద్ర ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ మూడు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి మంచి ఫాలోయింగ్:

చాలా రాష్ట్రాల ప్రజల్లో మోదీకి భారీ ఫాలోయింగ్ ఉండగా.. మూడు రాష్ట్రాల్లో మాత్రం రాహుల్ గాంధీ మీద తమకు నమ్మకముందని అన్నారు. గోవా రాష్ట్రంలో 52.4 శాతం, కేరళ 46.87 శాతం, తమిళనాడు 42.76 శాతం ఫాలోయింగ్ రాహుల్ గాంధీకి ఉంది. ఈ రాష్ట్రాల్లో 41.3%, 36.4%, 37.64% మాత్రమే మోదీకి మద్దతు లభించింది.

రీసర్చ్ సంస్థ CVoter's "State of the Nation 2020: May" లో భాగంగా ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది. 3000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను రాష్ట్రాలలోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ సేకరించారు.

Next Story