న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

By సుభాష్  Published on  1 Jan 2020 4:14 PM GMT
న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

1. చిచ్చ‌ర పిడుగు ‘ర‌షీద్ ఖాన్’ విధ్వంసం.. 18 బంతుల్లోనే..

అఫ్గానిస్థాన్ యువ సంచ‌ల‌నం ర‌షీద్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా దేశ‌వాళి లీగ్ బిగ్‌బాష్ లీగ్‌ (బీబీఎల్‌)లో లీగ్‌లో తన ప్రతాపం చూపించాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్‌ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్‌ 168 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

2. మందుబాబులకు శుభ‌వార్త‌.. ఆ వైన్ షాపులో ఓ ఆఫ‌ర్ ఉంది..!

మహబూబాబాద్ న‌గ‌రంలో ఓ వైన్స్ షాపు యాజ‌మాన్యం మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. లక్కీ డ్రా స్కీమ్ ను తీసుకువచ్చింది. కొత్త‌ సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురష్కరించుకుని జయశ్రీ వైన్స్ యాజ‌మాన్యం ఈ వినూత్న స్కీమ్‌ను ప్రవేశ‌పెట్టింది. అయితే.. రూ. 2వేలు, అంతకుమించి కొనుగోలు చేసిన వారికి మ‌త్ర‌మే లక్కీ డ్రా కూపన్‌లు ఇస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అక్కడ బిడ్డ నేలమీద పడాలంటే.. ఎన్నో కిలోమీటర్లు నడవాల్సిందే..

Advertisement

అక్కడ తల్లి కడుపులోంచి బిడ్డ బయట పడాలంటే ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి నెలకొంది. పురిటి నొప్పులతో బాధపడే మహిళలే కాదు.. ఆస్పత్రులకు వెళ్లే ఏ రోగులైన ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఏపీలోని విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం దాహపర్తి పరిధిలోని పొర్లు గ్రామంలో గిరిజనుల కష్టాలు అన్ని ఇన్ని కావు. గ్రామానికి సరైన రోడ్డు పౌకర్యం లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులకు గురి కావల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

Advertisement

4. నాకు ఆ పదవే ఇష్టం..!

హైదరాబాద్‌: తాను కాబోయే సీఎం అన్నది వాస్తవం కాదని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తానే సీఎంగా కొనసాగుతానని కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారని.. అయినా కేటీఆర్‌ సీఎం అని మళ్లీ ప్రచారం చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఫిబ్రవరి తర్వాత టీఆర్‌ఎస్‌ శ్రేణులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ అన్నారు. సోషల్‌ మీడియా టీమ్‌ను కూడా పటిష్టం చేస్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికలపై రెండు రోజుల్లో కేసీఆర్‌కు నివేదిక అందిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

5. మ‌హాన‌గ‌రానికి మ‌త్తెక్కించారు.. రికార్డ్‌లు సృష్టించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..!

తెలంగాణ రాష్ట్రంలో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్ దుమ్ములేపాయి. ప్రతి ఒక్కరు పార్టీ జోష్‌లో మునిగిపోయారు. మ‌రీ ముఖ్యంగా హైదరాబాద్ న‌గ‌రంలో అర్థ‌రాత్రి 3, 4 నాలుగు గంట‌ల వ‌ర‌కు జోరుగా జ‌రిగాయి. అర్థరాత్రి 12 గంటల వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌డంతో.. జ‌నాలు జోరుగా మ‌ద్యం సేవించి నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

6. కోట్లల్లో ధర పలుకుతున్న అరుదైన పాము

కొన్ని అరుదైన విషరహిత పాములకు అంతర్జాతీయ మార్కెట్లో బాగా డిమాండ్‌ ఉంది. ఈ పామును మందులు, సౌందర్యసాధనాల తయారీలో ఉపయోగిస్తుంటారు. అలాంటి పాములను కొందరు మార్కెట్లో విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లా నర్సింగ్‌ గఢ్‌ లో ఐదుగురు వ్యక్తులు ఓ పామును విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

7. వీళ్లను ఇలా ఉరి తీయడం దేశంలోనే మొదటిసారి

2012, డిసెంబర్ 15న దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల శిక్షలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు దోషులను ఒకేసారి ఊరితీయనున్నట్లు తెలుస్తోంది. వీరి ఉరి తీతకు తీహార్‌ జైలులో ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ దోషులైన అక్షయ్‌ కుమార్‌, పవన్‌, ముఖేష్‌, వినయ్‌లకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

8. ఈ సారి మాత్రం ప‌క్కా.. కన్ఫర్మ్ చేశాడు..!

టీమిండియా యువ ఆట‌గాడు, ఆల్‌రౌండ‌ర్ హార్దిక్‌ పాండ్యా తన జీవితానికి సంబందించి అతి ముఖ్య‌మైన విష‌యాన్ని బాహ్య ప్ర‌పంచంతో షేర్ చేసుకున్నాడు. త‌న ప్రియురాలు ఎవ‌రో రివీల్ చేశాడు. కొత్త సంవత్సరం వేడుక‌లలో ప్రియురాలితో స‌హా పాల్గొన్న‌ హార్దిక్‌ పాండ్యా ఈ మేర‌కు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఒక పోస్టు చేశాడు. సెర్బియా మోడల్‌ నటాషా స్టాన్‌తో హార్దిక్‌ పాండ్యా గ‌త కొంత కాలంగా ప్రేమ క‌లాపాలు సాగిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

9. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వార్నింగ్‌

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. బాగ్దాద్‌ లోని తమదేశ ఎంబసీపై నిరసనకారులు చేసిన దాడిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్‌ భూభాగంలోకి తాము వందలాది ట్రూపులను పంపిస్తామని ట్రంప్‌ సర్కార్‌ వెల్లడించింది. గతనెల 29న ఇరాన్‌కు చెందిన కతాబాద్‌-ఏ హిజ్బుల్లా అనే గ్రూపు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 24 మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

10. 11 ఏళ్ల తెలుగు బాలిక గిన్నిస్ రికార్డ్

రెండు చేతులతో ఎడాపెడా బాణాలు వేసి శత్రుసేనల్ని చిత్తుచేసిన సవ్యసాచి అర్జునుడి గురించి పురాణకథల్లో విన్నాం. కేవలం గురువు బొమ్మని ఎదురుగా పెట్టుకుని అంకుంటిత సాధనతో అప్రతిహతమైన ధనుర్విద్యను అభ్యసించిన ఏకలవ్యుడి గురించి విన్నాం. పాండవులకూ, కౌరవులకూ విలువిద్యను నేర్పిన అసమాన ప్రతిభాశాలియైన ద్రోణుడి గురించి విన్నాం. కురుక్షేత్ర సంగ్రామంలో మృత్యువును తలపించే రీతిలో విరుచుకుపడి శత్రుసైన్యాన్ని చెండాడిన భీష్మ పితామహుడి గురించి విన్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి…

Next Story
Share it