మహానగరానికి మత్తెక్కించారు.. రికార్డ్‌లు సృష్టించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jan 2020 9:38 AM GMTతెలంగాణ రాష్ట్రంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ దుమ్ములేపాయి. ప్రతి ఒక్కరు పార్టీ జోష్‌లో మునిగిపోయారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి 3, 4 నాలుగు గంటల వరకు జోరుగా జరిగాయి. అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరగడంతో.. జనాలు జోరుగా మద్యం సేవించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
అయితే.. ప్రతి న్యూ ఇయర్ వేడుకలప్పుడు.. మద్యం అమ్మకాల్లో టాప్‌గా నిలిచే తెలంగాణ.. ఈ సారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో రికార్డ్ సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్క రోజు రాత్రే 3148 కేసులు నమోదయ్యాయంటే మన మందుబాబులు ఎంతగా తాగి ఊగి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఇక రాజధాని హైదరాబాద్ విషయానికొస్తే.. నిన్న రాత్రి మహానగరం మందుబాబులతో ఊగింది. తెలంగాణ వ్యాప్తంగా ఒక్క మహానగరంలోనే హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో 951, సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో 873, రాచకొండ కమీషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే.. పట్టు పడిన వారిలో మైనర్ల నుండి పండు ముసళ్లోల్ల వరకూ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 9 మంది మైనర్లు పట్టుపడగా.. మరో 9మంది 65 ఏళ్లకు పైబడిన తాతలు కూడా పట్టుబడ్డారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిపిన ఈ తనిఖీలలో కేవలం ఒకే ఒక్క మహిళ.. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో పట్టుబడింది.
ఇక తెలంగాణ వ్యాప్తంగా నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవగా.. మిగతా జిల్లాల్లో కూడా ఓమోస్తరుగా నమోదయ్యాయి.
�
�