మందుబాబులకు శుభవార్త.. ఆ వైన్ షాపులో ఓ ఆఫర్ ఉంది..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jan 2020 12:15 PM GMTమహబూబాబాద్ నగరంలో ఓ వైన్స్ షాపు యాజమాన్యం మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. లక్కీ డ్రా స్కీమ్ ను తీసుకువచ్చింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురష్కరించుకుని జయశ్రీ వైన్స్ యాజమాన్యం ఈ వినూత్న స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
అయితే.. రూ. 2వేలు, అంతకుమించి కొనుగోలు చేసిన వారికి మత్రమే లక్కీ డ్రా కూపన్‌లు ఇస్తారు. ఈ డ్రాలో గెలుపొందినవారికి ప్రథమ బహుమతిగా ఎల్సీడీ టీవీ, ద్వితియ బహుమతిగా స్మార్ట్ ఫోన్, తృతీయ బహుమతిగా సిల్వర్ కాయిన్స్, ఇతర బహుమతులుగా గ్లాస్ సెట్లను ఇవ్వనున్నారు.
ఇక, ఇటీవల మద్యం ధరలు పెరగడంతో ఒక్కసారిగా అమ్మకాలు తగ్గాయి. మందుబాబులను ఆకర్సించి.. సేల్స్ పెంచడం కోసమే ఇలా లక్కీ డ్రాను ప్రవేశపెట్టినట్లు వైన్స్ షాపు యాజమాన్యం అంటున్నారు. ఇక ఆఫర్ ఉండటంతో మందుబాబులు వైన్ షాపు ముందు బారులు తీరారు.
Next Story