అలాంటి కేసీఆర్‌పైనే సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా?: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పాలన..ఎన్నికల ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్లుగా ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

By Knakam Karthik
Published on : 3 Sept 2025 5:20 PM IST

Telangana, Congress Government, Ktr, Brs, Cm Revanthreddy

అలాంటి కేసీఆర్‌పైనే సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా?: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పాలన..ఎన్నికల ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్లుగా ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎర్రవల్లిలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో ఎవరిని అడిగినా కెసిఆర్ పాలననే బాగుంది అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ముఖ్యంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అని చాలా మంది చెప్పారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తరువాత చెప్పుల జాతర అన్నట్లుగా ఉంది. అనాటి కాంగ్రెస్ పాలన రోజులను మళ్ళీ గుర్తు చేశారు రేవంత్. దేశం చరిత్రలోనే కెసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రాష్ట్రం రాక ముందు గోదావరి, కృష్ణ నీటి కోసం ఎన్నో గొడవలు జరిగాయి కానీ నీళ్లు రాలేదు. 2014 లో మన వ్యవసాయం ర్యాంక్ దేశంలో 14వ ర్యాంక్..కానీ స్వరాష్ట్రం వచ్చాక 2022లో నెంబర్ వన్ స్థానానికి వచ్చాం. మేడిగడ్డ వద్ద 365 రోజుకు నీళ్ళు ఉంటాయి. 80 మీటర్ల నుండి,618 మీటర్ల ఉన్న కొండపోచమ్మ సాగర్ నీటిని తెచ్చారు..అని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మన తెలంగాణలో ఉంది అదే కాళేశ్వరం. హైదరాబాద్ అనే మహానగరానికి తాగు నీటికి ఇబ్బంది లేకుండా మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్మించారు. అట్లాంటి కెసీఆర్ పై సీబీఐ ఎంక్వయిరీ వేశారు. సీబీఐ మోదీ గారి జేబు సంస్థ అని రాహుల్ అంటాడు..రేవంత్ మాత్రము సీబీఐ మంచి సంస్థ అని రేవంత్ అంటున్నాడు. తెలంగాణ పచ్చగా ఉంటే కొంతమందికి నచ్చడం లేదు.. అందుకే కెసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో డైలాగ్‌లు తప్ప ఏమీ జరగడం లేదు. ఎన్నికల ముందు వేలం పాటలాగా 420 హామీలు ఇచ్చారు రేవంత్. ఇక్కడ ఉన్న వారికి ప్రభుత్వం నడపడం చాతకాదు. పదేళ్ల కెసీఆర్ పాలనలో 3 లక్షల కోట్ల అప్పు అని కేంద్రం స్పష్టంగా చెప్పిన కాంగ్రెస్ వారికి సిగ్గు లేదు..ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వారు నీటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. 21 నెలలో ప్రజలకు, రాష్టానికి పనికి వచ్చే పని చేయలేదు. గల్లి ఎన్నిక అయిన సరే..డిల్లీ ఎన్నిక అయిన ఎగరాల్సింది గులాబీ జెండే. కాంగ్రెస్ వాళ్ళు బంగారం కాదు ఇనుము కూడా ఇవ్వరు వీళ్ళు.. దండుపాళ్యం బ్యాచ్ ఇది...అని కేటీఆర్ విమర్శించారు.

Next Story