మాకేదో జీర్ణం కావడంలేదని ENO ప్రచారమెందుకు? పెట్టుబడులు ఎక్కడో ప్రజలకు చూపాలి: కేటీఆర్

నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా ప్రచారం అయినట్లు సీఎం రేవంత్ తీరు కూడా అలాగే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.

By Knakam Karthik  Published on  27 Jan 2025 2:57 PM IST
Telangana, Ktr, congress, Cm Revanth, Brs, Congress Government

మాకేదో జీర్ణం కావడంలేదని ENO ప్రచారమెందుకు? పెట్టుబడులు ఎక్కడో ప్రజలకు చూపాలి: కేటీఆర్

నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా ప్రచారం అయినట్లు సీఎం రేవంత్ తీరు కూడా అలాగే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. జనవరి 30న చార్ సే బీస్ వాదే, చార్సో దిన్ కార్యక్రమం పేరుతో కాంగ్రెస్‌పై పోరుబాటకు సిద్ధమైనట్లు కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ఎవీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు.

రేషన్ కార్డుల కార్యక్రమం చారిత్రాత్మకం అని చెప్పిన సీఎం.. కార్డులు గతంలో ఇవ్వలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని భట్టి విక్రమార్క మర్చిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేశారని, విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మంది బిడ్డను కూడా తన బిడ్డనే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దావోస్ పెట్టుబడుల పేరుతో ప్రచారం చేస్తూ, తమకేదో ఇబ్బంది అన్నట్లు ఈనో ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే పెట్టుబడులు ఎక్కడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మాకేదో జీర్ణం కాలేదని కేసీఆర్ ఫొటోలతో ఈనో ప్రచారం ఎందుకని ఫైర్ అయ్యారు. మాకంటే ఎక్కువగా అభివృద్ధి చేయండి, మేమే సన్మానం చేస్తామని కేటీఆర్ సవాల్ చేశారు.

Next Story