రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బందు..కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్స్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు.
By - Knakam Karthik |
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు. ఈ మేరకు హరీశ్ రావు ఎక్స్ వేదికగా కాంగ్రెస ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ధి బందు.." అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి బందు, జాబ్ క్యాలెండర్ బందు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బందు, నిధుల లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బందు.. డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బందు, రైతులకు రుణ మాఫీ బందు, పంట బోనస్ బందు, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బందు.. పంట పండిద్దామంటే చివరకు అన్నదాతకు యూరియా బందు..22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ది బందు.. ఎక్కడ చూసినా బందు, బందు, బందు..రేవంత్ రెడ్డి.. నీ చేతగాని, దద్దమ్మ పాలనను చూసి అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారి పోయారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్దమయ్యారు. మీ డ్రామాలను బందు పెట్టే రోజులు ఇక దగ్గర్లోనే ఉన్నాయి...అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు ❌ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందు❌విద్యార్థులకు నిరుద్యోగ భృతి బందు, జాబ్ క్యాలెండర్ బందు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బందు❌నిధుల లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బందు.. డీజిల్ పోయించేందుకు…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 15, 2025