గత ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది.. కానీ ఇప్పటి వరకూ అ రిపోర్ట్ బయట పెట్టలేదని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. గాంధీ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సకలజనుల రిపోర్ట్ ఎక్కడకి పోయింది కేసీఆర్, కేటీఆర్ అని ప్రశ్నించారు. బీసీ కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్నారు. మూడు నెలల లోపల కులగణన రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ చెప్పిందన్నారు. రేవంత్ రెడ్డి కులగణన బిల్లును అసెంబ్లీలో పెట్టారని గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి.. బీసీ కులగణన చేయాలని చెప్పారన్నారు. సకలజనుల రిపోర్ట్ ని చీప్ సెక్రటరీ కి ఇవ్వాలన్నారు. సకల జనుల రిపోర్ట్ ఇస్తే బీసీ కులగణనకి ఊయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ కూడా వచ్చిందన్నారు. 90% ఉన్న ప్రజలకి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. సీఎం రూ.150 కోట్లు రిలీజ్ చేస్తే రెండు నెలలోనే బీసీ కులగణన రిపోర్ట్ వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే కులగణన ప్రారంభించాలని కోరారు. కేసీఆర్, కేటిఆర్ లకు చిత్త శుద్ది ఉంటే సకలజనుల రిపోర్ట్ బయట పెట్టాలన్నారు. బీసీ కులగణన కంప్లీట్ అయాక సర్పంచ్ ఎన్నికలు వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.