బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రజల ఆరోగ్యం చూడకుండా బీర్, బ్రాందీ అమ్మి ప్రజల రక్తం తెలంగాణ సీఎం కేసీఆర్ తాగుతున్నారని

By Medi Samrat  Published on  30 Aug 2023 9:00 PM IST
బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రజల ఆరోగ్యం చూడకుండా బీర్, బ్రాందీ అమ్మి ప్రజల రక్తం తెలంగాణ సీఎం కేసీఆర్ తాగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్,కాంగ్రెస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా కుంటుంబ పార్టీలేనన్నారు. కేసీఆర్ చేతిలో ఉన్న అన్ని వస్తువుల ధరలను ఆయన పెంచారన్నారు. ఇక భూములు అమ్మనిదే కేసీఆర్ ప్రభుత్వం నడిచే స్థితిలో లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు కిషన్ రెడ్డి. ఒక చేతిలో ఆసరా పెట్టి, మరో చేతిలో బీర్ బ్రాందీ తో ఆ ఆసరా పెన్షన్ ను కేసీఆర్ కొట్టేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఇష్టా రాజ్యాంగ భూములు అమ్ముతున్నారన్నారు.. ఇక పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం దగ్గర స్థలం ఉండదని.. అదే అమ్ముకోవడానికి మాత్రం భూములు దొరుకుతున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం వికాస్ రావు లాంటి దంపతులు బీజేపీ పార్టీలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలిక అవసరాల కోసం రోడ్లను తాకట్టు పట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. కేసిఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

వంట గ్యాస్ ధర తగ్గింపు పై బీఆర్ఎస్ నేతలు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రధాని తగ్గించారని.. ప్రధాని పిలుపుతో అనేక రాష్ట్రాలు కూడా ధరలు తగ్గించాయన్నారు. తెలంగాణలో మాత్రం ఒక్క రూపాయి తగ్గించని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గింపుపై మాట్లాడటం గురి గింజ మీద సామెత లా ఉందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్లకి లేదన్నారు.

Next Story