ఆయన డ్రామా ఆర్టిస్ట్, ఈయన స్క్రిప్ట్ లీడర్..ఆ ఇద్దరిపై జగ్గారెడ్డి సెటైర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు

By Knakam Karthik
Published on : 22 Aug 2025 1:27 PM IST

Telangana, Congress, Jaggareddy, Ktr, Brs, Kishanreddy, Bjp

ఆయన డ్రామా ఆర్టిస్ట్, ఈయన స్క్రిప్ట్ లీడర్..ఆ ఇద్దరిపై జగ్గారెడ్డి సెటైర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కేటీఆర్ డ్రామా ఆర్టిస్ట్. కేటీఆర్‌కు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ ఐతే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన మీ నాయన కూడా థర్డ్ క్లాస్ నేనా? తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయిందా కేటీఆర్? తెలంగాణ ఇచ్చిన తరువాత మీ కుటుంబం అంతా కలిసి సోనియా గాంధీ ఇంటికి వెళ్లినప్పుడు కానిది ఇప్పుడు ఎలా అయింది? మీరు మీ కుటుంబ రాజకీయం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ వల్ల కాదా? తెలంగాణ వచ్చింది అంటే కాంగ్రెస్ వల్లనే అని కేసీఆర్ మాట్లాడింది నిజం కాదా? మీ నాయన కేసీఆర్ రాజకీయ పాఠాలు నేర్చుకుంది కాంగ్రెస్ పార్టీలోనే కదా? తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకుంటే కేటీఆర్ అమెరికా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కేటీఆర్ ఎవరు అనేది ఎవరికి తెలియకపోయేది. తెలంగాణ బిడ్డ, రాజ్యాంగ నిపుణులు, తెలంగాణ వాది సుదర్శన్ రెడ్డిను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతు ఇవ్వకపోవడం కేటీఆర్ రాజకీయానికి పరాకాష్ట..అని జగ్గారెడ్డి విమర్శించారు.

కేటీఆర్ తాత ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఇలా మాట్లాడితే కొట్టే వారు ఎందుకంటే వారికి తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక కేసీఆర్ జాక్‌పాట్ కొట్టి సీఎం అయ్యాడు. 7 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు 65 వేల కోట్లు ఉంటే 10 ఏళ్లలో 7 లక్షల అప్పు చేశారు. కేసీఆర్ మనువడు, ముని మనువడు తిన్నా అరగని ఆస్తులు సంపాదించుకున్నారు. జగ్గారెడ్డిగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఉండాలి అనుకుంటా మేము సెక్యులర్. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు నేను భయపడను. సంగారెడ్డి ప్రజల కోసం నేను సచివాయలంలో రివ్యూ చేసాను...బీఆర్ఎస్ తరహాలో దందాలు చేయలేదు. అధికారంలో ఉన్న నేను లేకున్నా ప్రజల కోసం జగ్గారెడ్డి పని చేస్తాడు..అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Next Story