కేటీఆర్ తండ్రి చాటు కొడుకు.. కాంగ్రెస్ గురించి ఆయనకేం తెలుసు.? : జగ్గారెడ్డి
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 26 Feb 2024 2:27 PM ISTరాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పుడు న్యాయ యాత్ర పేరుతో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ ఎప్పుడూ మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ మతాన్ని రాజకీయం చేయరన్నారు. బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళను మొక్కుతున్నట్టు క్రియేట్ చేస్తుంది.. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు.
గుడి కట్టి.. దేవుడి గుడిని కూడా రాజకీయానికి వాడుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీ ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. దేవుడి గురించి మాట్లాడే బీజేపీ నేతలు..పెట్రోల్.. డీజిల్.. నిత్యవసర ధరల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ధరల పెరుగుదల పై మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డి కి లేదన్నారు.
ప్రజలను మోసం చేసే మాటలు బీజేపీ చెప్తుంది.. ప్రజలు గమనించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి.. అంటే తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్నారు. మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి... హైదరాబాద్ ఎంపీ సీటు కూడా గెలిపించండి.. మంచి రోజులు వస్తాయన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే.. పెట్రో..డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత బీజేపీ ఎప్పుడో విస్మరించిందన్నారు.
బీజేపీ ఎంతసేపు.. రాముడు.. హాన్మంతుడు అని ఎమోషన్స్ చెప్తుందన్నారు. దేవుళ్ళు.. గుడి.. మతం పేరు చెప్పి ప్రధాని ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలుస్తుంది అని ప్రచారం చేసుకుంటుంది.. 9 ఏళ్లలో మేము ఇది చేశాం అని ప్రజలకు చెప్పే పని చేసిందా అని ప్రశ్నించారు.
యువతకు ఉద్యోగాలు ఇచ్చిందని 400 సీట్ల కావాలా అని ప్రశ్నించారు. బీజేపీ 420.. పార్టీ.. ప్రజలను చిటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మీద చిటింగ్ కేసు పెట్టాలన్నారు. పేదల కడుపు నింపి ఓట్లు అడిగే ప్రయత్నం చేసిందా బీజేపీ.. కేవలం దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుందన్నారు. అయోధ్య గుడి ప్రారంభం కూడా ఎన్నికల ముందు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
ఏడాది ముందు ఎందుకు గుడి ప్రారంభం పెట్టుకోలేదన్నారు. ఓట్ల కోసమే అయోధ్య రామ మందిరం ప్రారంభం అని ఆరోపించారు. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించే సంప్రదాయం లేదు.. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం ఎంపిక ఉంటుందన్నారు. కేటీఆర్ కి తెలియదు అది.. తెలంగాణ ప్రజలకు తెలుసు.. కేసీఆర్ కి తెలుసు.. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ నుండి పోయిన వ్యక్తి కాబట్టి అని వివరించారు. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ.. మాజీ సీఎం కొడుకు కేటీఆర్.. అంతకు మించి ఆయనకు ఏం లేదన్నారు.
బీజేపీ గాడ్ పాలిటిక్స్ చేస్తుంది.. రాహుల్ గాంధీ.. పబ్లిక్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. బీజేపీది జేబులు నింపే అజెండా.. కాంగ్రెస్ ది పేదల కడుపు నింపే అజెండా.. బీజేపీ పుట్టకముందు నేను పుట్టిన.. బీజేపీ నేతలు షార్ట్ కట్ లీడర్స్ అని కామెంట్ చేశారు.