ఆరడుగులు పెరిగారు, అర అంగుళం మెదడు పెంచుకోలేదు..హరీశ్‌రావుపై టీపీసీసీ చీఫ్ సెటైర్లు

హరీశ్ రావు ఆరడుగులు పెరిగారు తప్ప, అర అంగుళం మెదడు పెంచుకోలేదు..అని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

By Knakam Karthik
Published on : 17 July 2025 1:01 PM IST

Telangana, Tpcc Chief Maheshkumar Goud, Brs Mla Harishrao, Congress, Brs, Kcr, Cm Revanthreddy

ఆరడుగులు పెరిగారు, అర అంగుళం మెదడు పెంచుకోలేదు..హరీశ్‌రావుపై టీపీసీసీ చీఫ్ సెటైర్లు

హరీశ్ రావు ఆరడుగులు పెరిగారు తప్ప, అర అంగుళం మెదడు పెంచుకోలేదు..అని టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఢిల్లీలో నిన్న నీటి పారుదల అంశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో ఏ అంశాలపై ఏమీ మాట్లాడారో స్వయంగా కేంద్ర మంత్రి సి.ఆర్ పాటిల్ చెప్పిన కూడా హరీష్ రావు పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూన్నాడు. హరీష్ రావు వాదనలలో పస లేదు. మీటింగ్ లో ఏఏ అంశాలు మాట్లాడారో స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా హరీష్ రావు మెదడుకు ఎక్కనట్టు ఉంది. హరీష్ రావు ఆరు అడుగులు పెరిగాడే తప్ప ఆర అంగుళం మెదడు పెంచుకోలేదు. అడ్డగోలుగా అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. సీఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప హరీష్ రావుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు ..అని మహేశ్ కుమార్ విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు సవాల్ విసిరారు. అసెంబ్లీ వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా మేమే ఫామ్ హౌస్ కు వచ్చి అక్కడ మాక్ అసెంబ్లీ పెడుతాము మీరు పాల్గొనండి అని సవాల్ చేస్తే అక్కడ నుంచి నోరు లేవలేదు. మీరు మళ్ళీ సిగ్గులేకుండా సవాళ్ల గురించి మాట్లాడుతున్నారు. గోదావరిలో 3 వేల టిఎంసీల నీటి వరద ఉంది...ఆంధ్ర ప్రాజెక్టు లు కట్టుకున్నా మనకు సమస్య లేదు. రాయలసీమను రతనాల సీమ చేస్తాను.. బెసీన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ అంటేనే కదా ఈ రోజు వాళ్ళు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నది. తెలంగాణకు అడ్డగోలుగా ద్రోహం చేసినా మీరే మళ్ళీ సిగ్గులేకుండా మా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో పెట్టే చర్చలకు నువ్వు, మీ మామ కేసీఆర్ లు వచ్చి మీ వాదన చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే జనం నమ్మరు...అని హరీశ్‌రావుపై టీపీసీసీ చీఫ్ సెటైర్లు వేశారు.

Next Story