ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న అభిమానం కేటీఆర్‌కు లేదు: టీపీసీసీ చీఫ్
ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న అభిమానం కేటీఆర్‌కు లేదు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By - Knakam Karthik |
ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న అభిమానం కేటీఆర్‌కు లేదు: టీపీసీసీ చీఫ్
ప్రజల్లో కేసీఆర్‌కు ఉన్న అభిమానం కేటీఆర్‌కు లేదు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నల్లేరు పై నడక! బీఆర్ఎస్ క్యాడర్ రోజురోజుకు తరిగిపోతుంది. బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉంటే కవిత ఎందుకు భయటకు వస్తుంది?. కేటీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే సోషల్ మీడియాను మ్యానేజ్ చేస్తున్నారు. బీజేపీలో ఉన్నవాళ్లు కూడా అటూ ఇటూ చూస్తున్నారు..ప్రస్తుతం ఉన్న వాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాం.
లోక్ సభ ఎన్నికల ఊపులో 8 మంది లోక్ సభ కు , 8 మంది అసెంబ్లీ కి గెలిచారు. వచ్చే ఎన్నికలలో అవి కూడా రావు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ఫెర్ఫార్మెన్స్ అందరూ చూసారు. కవితకు సీఎం పదవిపై ఆశ పుట్టింది. కవిత వలన టిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పుంజుకోదు. కేటీఆర్ బిఆర్ఎస్ నడిపించలేరు అతనితోని కాదు, ఆ విషయం కేటీఆర్ కూడా అర్థమైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసు కాబట్టి కెసిఆర్ ప్రచారానికి రాలేదు. ప్రజల్లో కెసిఆర్ కు ఉన్న అభిమానం, కేటీఆర్ కు లేదు...అని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణకే వస్తున్నాయి..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పెట్టుబడుదారులు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్లు కూడా హైదరాబాద్ వైపు ఆసక్తిగా ఉన్నారు. రానున్న నాలుగు సంవత్సరాలలో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి. మెస్సి ఈవెంట్ సక్సెస్ కావడంతో రాహుల్ గాంధీ సీఎం ను అభినందించారు...అని మహేశ్ కుమార్ అన్నారు.