ఆ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik
ఆ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనతో బీఆర్ఎస్ పార్టీకి వణుకు పుట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని వేల కోట్ల భూములు కొల్లగొట్టిందో తెలియదా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు యదేచ్ఛగా భూ కబ్జాకు పాల్పడ్డారు. టీజీఐఐసీ బ్యాంక్ దగ్గర తనఖా పెట్టి, ఐసీఐసీఐ బ్యాంకు దగ్గర రూ.10 వేల కోట్లు తీసుకుని రైతులకు ఇచ్చింది. ఏఐ టెక్నాలజీతో ప్రజలను తప్పుదోవ పట్టించారు. దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అవినీతి చేసిన పార్టీ బీఆర్ఎస్..అని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాలను కేసీఆర్.. తన వారికి అప్పనంగా అమ్ముకున్నారు. కంచ గచ్చిబౌలి భూముల గురించి పదేళ్లలో ఎందుకు పోరాడలేదు. HCU భూములైతే..కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఐఎంజీ సంస్థ బిల్లీరావుతో కమీషన్ మాట్లాడుకొని భూముల గరించి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులో పోరాడి 400 ఎకరాలను సాధించాం. ఈ ప్రభుత్వం కాపాడకుంటే 400 ఎకరాల భూమి ఐఎంజీ చేతికి వెళ్లి ఉండేది. బిల్లీరావుతో మాట్లాడుకున్న రూ. వేల కోట్ల కమీషన్ పోయిందనే అక్కసుతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబ అవినీతిపై చర్చకు సిద్ధమా..? 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ-ఫార్ములా కార్ రేస్‌లో కేటీఆర్ జైలుకు వెళ్తాడు, అది ఆయనకు కూడా తెలుసు..అని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.