దేశమంతా మోడీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు సంస్కరణలు, నీతివంతమైన పాలన అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టబోతున్న సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు జరిపిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఎక్కడెక్కడ అయితే డబుల్ ఇంజిన్ ఉందో.. ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని.. అక్కడ అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపునకు ప్రధాని సమర్థవంతమైన పాలన, సంక్షేం, అభివృద్ధి కార్యక్రమాలే కారణమని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరముందని, బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.