పవన్‌కల్యాణ్ అప్పుడు, ఇప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే: కవిత

కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్‌పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పవన్ కామెంట్స్‌పై స్పందించారు.

By -  Knakam Karthik
Published on : 3 Dec 2025 1:48 PM IST

Telangana, Hyderabad, Telangana Jagruti,  Kavitha, Andrapradesh, Pawan Kalyan

పవన్‌కల్యాణ్ అప్పుడు, ఇప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే: కవిత

హైదరాబాద్: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్‌పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పవన్ కామెంట్స్‌పై స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు ప్రాణాలే త్యాగం చేశారు. సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది. మేము పెద్దగా ఆలోచిస్తాం..అని కవిత అన్నారు.

మా రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యింది. ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా అనే అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో...ఆంధ్రా కూడా అంతే బాగుండాలని కోరుకున్నాం. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్ లో మాట్లాడాను. పక్కోడు బాగుంటే మా కళ్లు మండవు. పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం కాదు. మేము బాగుండాలనే కోరుకుంటాం. కానీ పక్కోడు చెడిపోవాలని అనుకోం. అలా అనుకొని ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపం వేరేలా ఉండేది.. మా బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప...ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదు. ఆనాడు మీరు సినిమా నటుడిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఏపీ డిప్యూటీ సీఎం. మీ మాటలను ఆంధ్రా ప్రజలకు ఆపాదిస్తారు. కనుక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి..అని కవిత సూచించారు.

Next Story