మరో ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..కానీ వారికి మాత్రమే
కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 6:47 AM IST
మరో ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..కానీ వారికి మాత్రమే
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇంటింటి సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు.. మూడు పద్ధతుల్లో ఇప్పటివరకు తమ వివరాలు నమోదు చేసుకోని వారికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మూడు శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు వారికి మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్..కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి వారు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు.మరి కొందరు అందుబాటులో లేకుండా పోయారు వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారని అన్నారు. మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దశాబ్దాల ఓ బీసీల కల నిజం చేస్తాం. అసెంబ్లీలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించి...పార్లమెంట్‌లో పెట్టిస్తాం. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేస్తాం’డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ‘కలసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుంది. ప్రధానితోపాటు అన్ని పార్టీల నేతలను కలుస్తాం..విజ్ఞప్తి చేస్తాం. పార్లమెంట్‌లో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను కూడగడతాం .. రాజకీయ శక్తులను ఏకం చేస్తాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణలో జరిగిన కులగణన సర్వే దేశమంతా ఆదర్శంగా తీసుకోవడం కోసం.. సర్వేలో పాల్గొనని 3% జనాభా కోసం మరోసారి అవకాశం కల్పిస్తున్నాం. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చు.. #TelanganaCasteCensus pic.twitter.com/ex7yGW3xIe
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) February 12, 2025