తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం.. ఫోన్ టాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు అధికారులతో చర్చించినట్టుగా సమాచారం. అలాగే తన మంత్రి వర్గ సహచరులతో కూడా మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే ఫోన్ టాపింగ్ కేసుతో తమకు సంబంధం లేదని ఇప్పటికే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అధికారులు రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా చేసే కార్యకలాపాలతో తమకు సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు. కానీ బీఆర్ఎస్ పై ఎటాక్ మాత్రం ఆగలేదు. దాదాపు రెండేళ్లుగా మీడియా ట్రయల్ నడుస్తూనే ఉంది. దీనిపై కేటీఆర్ (KTR)కోర్టును కూడా ఆశ్రయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి కొండా సురేఖ కూడా సమంత విషయంలోనూ సంచలన కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఆమె ఆ కేసును ఎదుర్కొంటున్నారు.