పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌ను బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిశారు. కేసీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని.. స్టేషన్ ఘన్ పూర్‌లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమని, ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు.
కాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇప్పుడు కేసీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై జోస్యం చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.