వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్

తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

By Knakam Karthik
Published on : 19 Aug 2025 1:37 PM IST

Telangana, Cm Revanthreddy, Farmers, Brs, Bjp, Urea Distribition

వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్

తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ప్రియాంక గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు..అని ట్వీట్ చేశారు.

రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని మేం లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణం. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజనలో బిజీగా ఉన్నారు. మన రైతుల కోసం మోదీ సర్కారు పై వత్తిడి తెచ్చేందుకు మాతో కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పత్తా లేరు. గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు…ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు!? మోదీ అంటే భయమా! భక్తా!?..అని సీఎం రేవంత్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story