తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా పండర్‌పూర్, తుల్జాపూర్ ఆలయ పట్టణాలను సందర్శిస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ సోమవారం ఉస్మానాబాద్ జిల్లాలోని ఒమెర్గాకు చేరుకుని అక్కడి నుంచి షోలాపూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మంగళవారం షోలాపూర్‌లోని పంఢర్‌పూర్ పట్టణంలోని లార్డ్ విఠల్ ఆలయాన్ని సందర్శించి దేవుడికి పూజలు చేస్తారు.
అనంతరం షోలాపూర్‌లోని సర్కోలి గ్రామంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా సీఎం హాజరవుతారు. ఆ తర్వాత రావు ఉస్మానాబాద్‌లోని తుల్జాపూర్‌కు బయలుదేరి అక్కడ మంగళవారం మధ్యాహ్నం ప్రసిద్ధ తుల్జా భవానీ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇదిలావుంటే.. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 15న కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పార్టీ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించారు.