హామీలు అమలు కావు, ఆయనుంటే..కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ సీఎంగా రేవంత్ ఉన్నంత కాలం హామీలు అమలు కావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 3:01 PM IST
హామీలు అమలు కావు, ఆయనుంటే..కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ సీఎంగా రేవంత్ ఉన్నంత కాలం హామీలు అమలు కావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మెదక్‌లో టీచర్స్‌తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్‌పై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని పాలనలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై రోడ్డున పడిందని విమర్శించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ రూ.9 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఆ తర్వాత వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అప్పులు, భూముల అమ్మకాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్ అవసరాలకు ప్రభుత్వం భూములు అనేవే లేకుండా అన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ప్రధాని మోడీ ఏం ఇచ్చారని కాంగ్రెస్, బీఆర్ఎస్ అడుగుతున్నాయని.. ఏం ఇవ్వలేదో ఆ పార్టీలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడికి కేంద్ర సాయం చేస్తుందని గుర్తు చేశారు. నిరుపేదల కడుపు నింపేందుకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే.. రేషన్ కార్డుపై రేవంత్ సర్కార్ బొమ్మ వేసుకుంటుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రతి పథకంపై తమ ఆనవాళ్లు లేకుండా రాష్ట్రంలోని కాంగ్రెస ప్రభుత్వం కుట్రలు చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 400 రోజుల పైనే అయ్యింది. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ అమ్మాయిలకు ఒక్క స్కూటీ అయినా ఇచ్చిందా ? pic.twitter.com/qKIpX2WWj4
— G Kishan Reddy (@kishanreddybjp) February 21, 2025