మైసమ్మ జాతరలో ఒకే ఫ్లెక్సీలో మూడు పార్టీల అధినేతల ఫొటోలు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ జాతరలో వెలిశాయి.

By Knakam Karthik  Published on  19 Jan 2025 1:48 PM IST
Telangana news, brs, tdp, janasena, cm Chandrababu, kcr, ktr,pavan kalyan

మైసమ్మ జాతరలో ఒకే ఫ్లెక్సీలో మూడు పార్టీల అధినేతల ఫొటోలు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ జాతరలో వెలిశాయి. ఈ ముగ్గురి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని కొంతమంది అభిమానులు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో వీరి ముగ్గురితో పాటు దివంగత నేత ఎన్టీఆర్, సినీ నటుడు చిరంజీవి, ఏపీ మంత్రి లోకేశ్, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావుల ఫొటోలు కూడా ఉన్నాయి.

అయితే ఈ ఫ్లెక్సీలో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చంద్రబాబుకు, ట్రెండ్ సెట్టర్ అంటూ పవన్ కల్యాణ్‌కు, గాడ్ ఆఫ్ తెలంగాణ కమింగ్ సూన్ అంటూ.. కేసీఆర్‌కు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటూ కేటీఆర్‌కు క్యాప్షన్ కూడా ట్యాగ్ చేశారు. ఇలా వివిధ పార్టీ నేతలందరినీ ఒకే ఫ్లెక్సీలో ప్రింట్ చేయడంతో మైసమ్మ జాతరకు వచ్చిన భక్తులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఇటీవల సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా వెంకటాపురం గ్రామంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, నటుడు బాలకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఘట్ కేసర్ జాతరలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై చర్చనీయాంశంగా మారింది.

Next Story