కేసీఆర్ ఫ్యామిలీ ఇష్టం వచ్చినట్టు అవినీతి, 6 గ్యారంటీలు అని రోజు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు.. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు ఐదు ఏళ్ల సమయం ఇచ్చారన్నారు. కేటీఆర్ కి ఓపెన్ ఛాలెంజ్.. ఉద్యమంలో ఆస్తులు అమ్మకుంటే 2009 నుంచి 2014లో మీ ఆస్తులు ఎలా పెరిగాయన్నారు.
హరీష్ రావు, కవిత ఆస్తులు అదే విధంగా పెరుగుతున్నాయి. కేసీఆర్ వద్ద అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏం ఉందో చెప్పాలన్నారు. మేము ప్రతీ ఎలెక్షన్ కి ఆస్తులు అమ్ముకుంటున్నం.. కానీ మీ ఆస్తులు పెరుగుతున్నాయన్నారు. ఫార్ములా ఈ-రేస్ లో కేటీఆర్ రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఐఏఎస్ లను బకరా చేసిండు.. నాకేం సంబంధం అధికారులు చూసుకోవాలి అని కోర్టులో అంటుండు.. లిక్కర్ రాణిమ్మ కవిత.. మీరు ఇచ్చిన లిక్కర్ సప్లై పర్మిషన్ లతోనే క్రైమ్ రేట్ పెరుగుతుందన్నారు.