కేసీఆర్‌ను రేవంత్ తిడుతుంటే కూతురిగా నా రక్తం మరిగిపోతుంది: కవిత
కేసీఆర్‌ను సీఎం రేవంత్ తిడుతుంటే తన రక్తం మరిగిపోతుంది..అని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు
By - Knakam Karthik |
కేసీఆర్‌ను రేవంత్ తిడుతుంటే కూతురిగా నా రక్తం మరిగిపోతుంది: కవిత
హైదరాబాద్: కేసీఆర్‌ను సీఎం రేవంత్ తిడుతుంటే తన రక్తం మరిగిపోతుంది..అని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అసెంబ్లీలో ఆమె మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. సెప్టెంబర్ 3వ తారీఖు రోజు ఎమ్మెల్సీ పదవికి రాజినామా చేశాను. నాలుగు నెలల నుంచి మండలి చైర్మన్ నా రాజీనామా లేఖ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నాలుగు నెలల కాలంలో అనేక సమస్యలు నేను చూశాను. ఈ సమస్యల పై మండలిలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నేను కూడా నా రాజీనామాను ఆమోదించాలని కోరుతాను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఇన్ టేక్ సోర్స్ పాయింట్ మార్చడం తప్పిదమే. కమిషన్ల కోసం తప్పిదం చేసింది హరీష్ రావు. మోసం చేసిన బబుల్ షూటర్ కి మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వడం పార్టీ తప్పిదం..అని కవిత మాట్లాడారు.
కేసీఆర్‌ను ఉరి వెయ్యాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాలకు రేవంత్ రెడ్డినీ రెండు సార్లు ఉరి వెయ్యాలి. ప్రజా స్వామ్యయుతంగా ఉండాల్సిన రాజకీయాలు కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నాకు రక్తం ఉడుకుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజక్ట్ పై బబుల్ షూటర్ ను అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించడం బాధాకరం. హరీష్ రావు కమిషన్ ల కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ సోర్స్ మార్చారు. బిఆర్ఎస్ మనుగడ సాధించాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి . లేకపోతే రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం ఉంటుంది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతి ప్రత్యామ్నాయంగా మారుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై సీఎం సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. సిట్ ఏర్పాటు చేస్తే నేను వచ్చి వివరాలు ఇస్తాను. బ్లేమ్ గేమ్ తో రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి..అని కవిత విమర్శించారు.