పాలమూరు ప్రాజెక్టుకు రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చుచేశాం: ఉత్తమ్
పాలమూరు ప్రాజెక్టు అంశంలో బీఆర్ఎస్‌పై మంత్రి ఉత్తమ్ విమర్శలు చేశారు.
By - Knakam Karthik |
పాలమూరు ప్రాజెక్టుకు రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చుచేశాం: ఉత్తమ్
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..BRS నాయకులు దుర్మార్గంగా బరితేగించి అబద్ధాలు చెప్తున్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం రెండేళ్లలో రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసాం. పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఏ అనుమతులు లేవు, కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. 45 టీఎంసీకి ఒప్పుకున్నారు అనేది అవాస్తవం, హరీష్ తెలివితో మాయమాటలు చెప్తున్నారు. హరీష్ రావు విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టాలని లేదు. 2020లో సెంట్రల్ కు పంపిన నీటి వాటాల పంపకాల్లో పాలమూరు, SLBC, డిండికి నీళ్లు అడుగలేదు. పదేళ్లలో BRS తెలంగాణ ప్రజలను మోసం చేసింది...అని ఉత్తమ్ విమర్శించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రాజెక్టలతోనే నీళ్లను పంపిణి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశాం. వచ్చే మూడేళ్లలో SLBC ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్న, మా ప్రభుత్వంలో పాలమూరు కు ఖర్చుచేసిన 7వేల కోట్ల లెక్కలు చెప్తం. హరీష్ రావు కమిషన్లు అంటున్నారు... మీ అలవాట్లు మాకు లేవు. ఏదో అద్భుతాలు చేసినట్లు కేసీఆర్ ఫ్యామిలీ వ్యాఖ్యలు ఉంటాయి. అసెంబ్లీ లో నిబంధనల ప్రకారం నడుస్తుంది. పీపీటీకి అవకాశం ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చామని చెప్తారా?..అని ఉత్తమ్ ప్రశ్నించారు.