కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది : మంత్రి సీతక్క

అసెంబ్లీ లాబీల్లో మంత్రి సీతక్క మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆమె బీఆర్ఎస్ నేతల నిరసనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు

By Medi Samrat  Published on  17 Dec 2024 12:45 PM GMT
కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది : మంత్రి సీతక్క

అసెంబ్లీ లాబీల్లో మంత్రి సీతక్క మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆమె బీఆర్ఎస్ నేతల నిరసనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు.. కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందన్నారు. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు.. నిరసనల్లో కూడా తమ దురంకారాన్ని ప్రదర్శించారన్నారు.

రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. టీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారు.. కనీసం అప్పుడు అధికారుల మీద చర్యలు లేవు అన్నారు. రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి చర్యలు కూడా తీసుకున్నారన్నారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటి? అని ప్ర‌శ్నించారు. గతంలో వెల్ లోకి వస్తే సభ నుంచి సస్పెండ్ చేసేవారు.. కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story