కేటీఆర్, బండి సంజయ్‌లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా..? ఎలా ఇవ్వరో మేము చూస్తాం.. ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇందిరమ్మను వాజ్ పాయ్ కాళీమాతతో పొల్చారని గుర్తుచేశారు. 10 నెలల కాలంలో జీఏస్టీ రూపంలో 37 వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసింది.. మరి కేంద్రం తెలంగాణ కు ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు.
దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు.. వీల్లేమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేసారా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఓక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా అని మండిపడ్డారు. భారతీయులు ఇందిరమ్మను ఇంకొక్క మాట అన్న ఊరుకోరు అన్నారు.
కేటీఆర్‌కు కూడా మంత్రి కౌంటర్ ఇచ్చారు. దరఖాస్తులు తీసుకుంటుంటే.. పథకాలకు దరఖాస్తులు ఎందుకు అన్నారు.. కేటీఆర్ ఏ ఊరికి పోదమో నువ్వే డిసైడ్ అవ్వు.. ఒక్క లబ్ధిదారుడికైనా అన్యాయం జరిగితే అప్పుడు అడుగు.. అసహనానికి కేటీఆర్ పరాకాష్ట అన్నారు. బీఆర్ఎస్ ఆర్దిక విద్వంసం తర్వాత కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. కేటీఆర్ కు కాంగ్రెస్ సంక్షేమం జీర్ణం కావడం లేదు.. అందుకే ఈనో ప్యాకెట్లు పంపిస్తానన్నారు.