దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో.. వ్యవసాయ విధ్వంసం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల సాగు బాగా తగ్గిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆందోళన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 12 Aug 2024 3:12 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల సాగు బాగా తగ్గిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో సాధించిన ప్రగతికి భిన్నంగా వ్యవసాయంలో కాంగ్రెస్ పాలన సాగుతూ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో వ్యవసాయం వైపు చూసే వాళ్లే తగ్గిపోయారని ఆవేదనను వ్యక్తం చేశారు. సోమవారం ఎక్స్‌లో వరుస పోస్ట్‌లలో, కేటీఆర్ పలు వార్తా నివేదికలను పంచుకున్నారు. తెలంగాణలో నాట్లు 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే పూర్తయ్యాయని అన్నారు.
"కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం..
కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం..
ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్
తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే.. ఢమాల్
ఒక్క ఏడాదిలోనే..
15.30 లక్షల ఎకరాల్లో
తగ్గిన సాగు విస్తీర్ణం..
ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు..
తొలి ప్రమాద సంకేతం..!
దశాబ్ద కాలంలోనే..
దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో..
ఎనిమిది నెలల్లోనే..
ఎందుకింత వ్యవసాయ విధ్వంసం..?
సంతోషంగా సాగిన సాగులో..
ఎందుకింత సంక్షోభం..??
మొన్న.. వ్యవసాయానికి కరెంట్ కట్
నిన్న.. రుణమాఫీలో రైతుల సంఖ్య కట్
నేడు.. సాగయ్యే భూమి విస్తీర్ణం కట్
రుణమాఫీ అని మభ్య పెట్టి..
పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే
రైతులకు ఈ అవస్థ..
రూ.500 బోనస్ అని..
నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ..
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..
కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు..
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..
అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి..
కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు..
రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు..
చెరువులకు మళ్లించే తెలివి లేదు..
ఒక్క మాటలో చెప్పాలంటే..
కాంగ్రెస్ పాలనలో..
రైతు బతుకుకు భరోసానే లేదు.
బురద రాజకీయాలు తప్ప..
సమయానికి సాగు నీళ్లిచ్చే
సోయి అసలే లేదు..
ఎరువులు-విత్తనాల కోసం రైతులకు తిప్పలు..
క్యూలైన్ లో పాసుబుక్కులు, చెప్పులు..
కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే..
పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులు
అప్పుల బాధతో..
అన్నదాతల ఆత్మహత్యలు
కౌలు రైతుల బలవన్మరణాలు
ఇలా..
ఒకటా.. రెండా..
సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణాలు.. సవాలక్ష !!" అంటూ ట్వీట్ వేశారు కేటీఆర్.