బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి, మోడీకి కేటీఆర్ విజ్ఙప్తి

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.

By Knakam Karthik
Published on : 18 April 2025 10:52 AM IST

Telangana, Congress Government, Cm Revanthreddy, Ktr, Pm Modi, Kancha Gachibowli Lands

బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి, మోడీకి కేటీఆర్ విజ్ఙప్తి

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని మోడీకి కేటీఆర్ కీలకమైన విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి..అని కేటీఆర్ ఎక్స్ వేదికగా కోరారు.

కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధారించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి.. అని కేటీఆర్ కోరారు.

Next Story