ప్రత్యర్థి పచ్చి బ్లాక్ మెయిల‌ర్‌.. ఈ సారి కూడా విజయం మనదే : కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుస్తున్నామ‌ని కేటీఆర్ అన్నారు. భువనగిరి మీటింగ్ లో ఆయ‌న మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  19 May 2024 9:15 AM GMT
ప్రత్యర్థి పచ్చి బ్లాక్ మెయిల‌ర్‌.. ఈ సారి కూడా విజయం మనదే : కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుస్తున్నామ‌ని కేటీఆర్ అన్నారు. భువనగిరి మీటింగ్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఓటర్లు అన్ని ఆలోచించి ఓటయ్యాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సార్లు గులాబీ పార్టీ గెలుస్తూ వస్తుంది. ఈ సారి కూడా విజయం మనదేన‌న్నారు. రాకేష్ రెడ్డి స్వయంకృషితో పైకి వచ్చాడు.. హైలి ఎడ్యుకేటెడ్ వ్యక్తి రాకెష్ రెడ్డి అని కొనియాడారు.

మోదీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్నారు. విభజన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారు. బీజేపీ వాళ్ళు గుడి కట్టి ఓట్లు అడుగుతున్నారు. మరి మనం కూడా యాదాద్రి ఆలయం కట్టాము. కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కట్టారు కేసీఆర్..కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు.

ఉమ్మడి నల్గొండలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామ‌న్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించాము. చేసిన పని సరిగా చెప్పుకోలేక పోయాము.. అందుకే ఓటమి పాలయ్యామన్నారు. మా పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసాము. అయినా స్వల్ప తేడాతో ఓటమి చెందామన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పూటకో మాట మారుస్తుంది. మనం ప్రశ్నించాలి. ఇవాళ తెలంగాణ ఆగం అయిందన్నారు.

420 హామీలను ఇచ్చి అన్నింటిని కాంగ్రెస్ మర్చిపోయింది. ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి.. ధిక్కార స్వరం రాకేష్ రెడ్డి.. ఆయ‌న‌ను గెలిపించాలన్నారు. 30వేల ఉద్యోగాలను కేసీఆర్ గారు భర్తీ చేస్తే.. వాటి జాయినియంగ్ లెటర్లు పంచుతూ రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొనట్టుకుంటున్నాడు. ఇది సిగ్గుచేటు.. పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డివి.. మన రాకేష్ రెడ్డి విద్యావంతుడు. అటు వైపు ఉన్న ప్రత్యర్థి పచ్చి బ్లాక్ మెయిల‌ర్‌.. సొల్లు కబుర్లు చెప్పే మోసగాడు.. ఓటర్లు ఆలోచన చేయాలని సూచించారు.

Next Story