ఆ నాలుగు ప్రశ్నలను.. నలభై సార్లు అడిగారు..!

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది.

By Medi Samrat  Published on  9 Jan 2025 6:30 PM IST
ఆ నాలుగు ప్రశ్నలను.. నలభై సార్లు అడిగారు..!

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు. కేటీఆర్ పై విచారణను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు. కేటీఆర్ ను ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ ప్రశ్నించారు.

విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, అధికారులకు విచారణలో సహకరించానని తెలిపారు. ఇది ఒక చెత్త కేసు అని, రాజకీయ కక్షపూరిత కేసు అని విచారణ అధికారులకు చెప్పానని అన్నారు. ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నలేమీ అడగలేదని, వారడిగిన ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు జవాబులు ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని చెప్పానని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే అధికారులు తిప్పితిప్పి అడిగారని, నాలుగు ప్రశ్నలను 40 సార్లు అడిగారన్నారు కేటీఆర్.

Next Story