హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్‌రెడ్డి గెలవాలని కోరుకుంటున్నట్లు..జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా కవిత మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి వన్నె తెస్తారు. రాజ్యాంగం పట్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంకితభావం ఉంది. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి కృషి చేస్తుంది. ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు వస్తాం. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు జాగృతి కృషి చేస్తుంది...అని కవిత పేర్కొన్నారు.
తెలంగాణ సాధన బొంత పురుగు ముద్దాడుతానన్న కేసీఆర్ స్పూర్తితో ముందుకు పోతాం. లెఫ్ట్ టు రైట్ అందర్నీ కలుపుకుని ముందుకు వెళతాం. కేసీఆర్ మూడోసారి వచ్చుంటే సామాజిక తెలంగాణ కోసం కృషి చేసేవారు. అందరి అభిప్రాయాలు తీసుకుని రాజకీయంగా ముందుకు వెళతాం. కాళేశ్వరంలో భాగమైన మల్లన్నసాగర్ నుంచే హైదరాబాద్ కు తాగునీటి కోసం రేవంత్ శంకుస్థాపన చేశారు. 15 వందల కోట్లు ప్రాజక్టును 7వేల 500 కోట్లకు పెంచారు. తెలంగాణ ప్రజల సొమ్ము మెగా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారు. కుంభకోణంలో భాగంగానే ప్రాజక్ట్ అంచనాలు పెంచారు..అని కవిత ఆరోపించారు.