ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు..ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik
ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు..ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనో మొన్నటి వరకు సంక్షేమ హాస్టళ్లకు తాళాలు.. నేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు తాళాలు వేస్తున్నారని విమర్శించారు. ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగళపల్లిలోని మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు భవనానికి అద్దె చెల్లించలేదని భవన యజమానులు బిల్డింగ్ కు తాళం వేశారు.
ఈ ఘటనపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని దుయ్యబట్టారు. కాగా భారత్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గతేడాది ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించారు. నెలలుగా అద్దె చెల్లించలేదని కళాశాలకు యజమానులు మంగళవారం తాళాలు వేశారు. నిన్న ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు తాళాలు ఉండటం చూసి షాక్ కు గురయ్యారు. అనంతరం ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని రెండు రోజుల్లో అద్దె చెల్లిస్తామని నచ్చజెప్పడంతో మళ్లీ తాళాలు తీసినట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు సంక్షేమ హాస్టళ్లకు తాళాలు..నేడు ప్రభుత్వ వైద్య కాలేజీకి తాళాలు..ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు?@revanth_anumula @DamodarCilarapu #CongressFailedTelangana pic.twitter.com/JJthchrBdm
— Harish Rao Thanneeru (@BRSHarish) April 30, 2025