వనపర్తి జిల్లాలో విషాదం.. కొద్ది గంటల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి

Groom dies in road accident hours before wedding. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి కావడానికి కొన్ని గంటల ముందే.. జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు అనంత

By అంజి  Published on  10 Feb 2022 9:17 AM GMT
వనపర్తి జిల్లాలో విషాదం.. కొద్ది గంటల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి

పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి కావడానికి కొన్ని గంటల ముందే.. జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు అనంత లోకాలకు వెళ్లాడు. దీంతో ఆ ఇంట జరగాల్సిన పెళ్లి వేడక మూగబోయింది. పెళ్లికి గంటల ముందు వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్య(35)కు వనపర్తి పట్టణానికి చెందిన ఓ మహిళతో గురువారం ఉదయం చర్చిలో వివాహం జరగాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

గురువారం తెల్లవారుజామున జడ్చర్లకు వెళతానని వరుడు చైతన్య కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. కారులో బయలుదేరిన ఆయన నక్కల బండ తండా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వరుడు చైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it