హైదరాబాద్: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు 7 రోజులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అకడమిక్ ఇయర్ ప్రాంరభంలో జనవరి 15 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉన్నట్టు విద్యాశాఖ పేర్కొంది. అయితే తాజాగా విడుదల చేసిన క్యాలెండర్‌లో 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ అని ఉంది. దీంతో సెలవులపై పునః సమీక్షించుకొని 2 శనివారంతో కలుపుకొని జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. సంక్రాంతి పండుగకు కాస్త సమయం ఉండటంతో సెలవుల ప్రకటన ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. సొంత గ్రామాలకు వెళ్లి ఈ పండుగను జరుపుకుంటారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 10 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీ నుంచి 17 వరకు 8 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవు తేదీలు ఇవేనని అధికారులు స్పష్టం చేశారు. పండుగ తరువాత జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించారు.