తెలంగాణ సెక్రటేరియట్‌కు వచ్చే విజిటర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం కండిషన్స్ పెట్టింది. ఇకపై సచివాలయం లోపలకు వెళ్లే వారికి ఇచ్చే పాసుతో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రటేరియట్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే సందర్శకుల పట్ల కఠిన నిబంధనలు అమలు చేయడంతో అప్పుడు విమర్శలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంక్షలను సడలించింది.
ప్రస్తుతం సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో.. భద్రత పటిష్టం చేసే క్రమంలో ఎస్పీఎఫ్ సిబ్బంది సందర్శకుల సంఖ్యను క్రమబద్ధీకరించే చర్యలను క్రమంగా అమల్లోకి తీసుకురావడం ప్రారంభించారు. ప్రస్తుతం సెక్రటేరియటల్‌లో సీఎం కార్యాలయం ఉండే మరో అంతస్తుకు విజిటర్స్ అనుమతి నిరాకరించారు. నిన్న చీఫ్ సెక్రటరీ ఫ్లోర్‌లో సందర్శకులు ఎక్కువగా కనిపించడంతో ఉన్నతాధికారులు ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సందర్శకులపై కొత్త రూల్స్ తీసుకొచ్చారు.
ఇటీవల ప్రభుత్వం సచివాయలంలో వాస్తు పేరుతో మార్పులు చేసి, తూర్పు వైపున ప్రధాన ద్వారం మూసివేసింది. ఈశాన్యం వైపునకు ప్రధాన గేటును మార్చారు. సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులకు డిసెంబర్ 12 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అటెండెన్స్‌ని అమలు చేస్తోంది. తాజాగా సందర్శకులపై ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.