మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం.. మైనంపల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం..అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik
Published on : 19 July 2025 3:24 PM IST

Telangana, Hyderabad, Congress, Former Mla Hanmantharao, Ktr, Brs

మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం.. మైనంపల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం..అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో షాడో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుక మాదిరి కేటీఆర్ అహంకార పూరిత మాటలు మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల అరాచక పాలనపై ఓ బుక్ రాసి గడప గడపకు పంచుతా. ఫోన్ ట్యాపింగ్‌తో సినీ, ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లో చిచ్చు పెట్టారు. యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన ప్రవళిక విషయంలో గాలి మాటలు, వెధవలా కేటీఆర్ ప్రవర్తించారు. ప్రవళిక ఆత్మహత్యకు లవ్ ఎఫైర్ అంటూ చిల్లర మాటలు మాట్లాడారు...అని హన్మంతరావు పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌తో నా గన్‌మన్లు, కుటుంబసభ్యులు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు. మీరు ఫామ్ హౌస్ రాసిస్తామని ఓ హీరోయిన్ బహిరంగంగా చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల జీవితాలను నాశనం చేశారు. మర్యాదగా మాట్లాడితే కేటీఆర్‌కు అర్థం కావడంలేదు. ఎక్కడికైనా వస్తాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. కేటీఆర్ నీ జీవితంలో సీఎం కాలేవు. మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం..తగ్గేది లేదు. వెయిట్ చేయండి తొందర పాటు వద్దు, లెక్కలతో సహా వడ్డిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం గుర్తుపెట్టుకో కేటీఆర్, హరీష్ రావు..అవసరమైతే ఇళ్లపై దాడులు చేస్తాం...అని హన్మంతరావు హాట్ కామెంట్స్ చేశారు.

Next Story