హైదరాబాద్: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. అది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్ అంటూ విమర్శించారు. దావోస్‌లో ఏం జరిగిందో, మళ్లీ అదే జరగబోతుంది. దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యాడు. గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమిని కేసీఆర్ ప్రభుత్వం సమీకరించింది. ఫార్మా సిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 13 ఎకరాల సమీకరించిన దానిలో రేవంత్ రెడ్డి చెమట చుక్క లేదు. ఆయన ఆలోచన లేదు..అని హరీశ్ రావు విమర్శించారు.
యువతకు ఉద్యోగాల కోసం కేసీఆర్ ఆలోచన చేస్తే.. ఆ భూములను తన అనుయాయులకు రేవంత్ రెడ్డి పప్పు బెల్లం మాదిరి పంచిపెడుతున్నాడు. మొదటి ఏడాది పాలనతో చూస్తే.. రెండో ఏడాది రేవంత్ పాలన పెనాం లోంచి పొయ్యిలో పడినట్లు అయింది. మూటో ఏడాది పాలన ఏమవుతుందో చూడాలి. ప్రజల్లో పాటు రేవంత్ రెడ్డి దేవుళ్ళను కూడా మోసం చేశాడు. రేవంత్ రెడ్డి దేవుళ్ళు విధించే శిక్ష నుంచి తప్పించుకోలేరు..అని హరీశ్ రావు పేర్కొన్నారు.