రిటైర్ అయినా వదిలిపెట్టం..అధికారులు, పోలీసులకు హరీశ్‌రావు వార్నింగ్
చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులకు మాజీ మంత్రి హరీశ్‌రావు వార్నింగ్ ఇచ్చారు
By - Knakam Karthik |
రిటైర్ అయినా వదిలిపెట్టం..అధికారులు, పోలీసులకు హరీశ్‌రావు వార్నింగ్
హైదరాబాద్: చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులకు మాజీ మంత్రి హరీశ్‌రావు వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. రిటైర్‌మెంట్ అయినా వదిలిపెట్టం, ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుని విచారిస్తాం అని హెచ్చరించారు. రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు మీకు ఏ మాత్రం సహకరించమని అన్నారు. మీ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టి మా మీద ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవర్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చానా ఆ పోలీసులను వదిలిపెట్టేది లేదు. అంతకు అంత అనుభవిస్తారు. జాగ్రత్త ఆలోచించుకోండి.అందుకే చట్టబద్దంగా న్యాయబద్దంగా వ్యవహరించండి...అని హరీశ్ రావు పేర్కొన్నారు.
దావోస్ నుంచి రేవంత్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్ లో కాదు, చట్ట ప్రకారం వ్యవహరించాలని, తప్పుడు సూచనలు, తప్పుడు ఆదేశాలను పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం..అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. కుట్రలతో బిఆర్ఎస్ నాయకులను బెదిరించాలని చూస్తున్న రేవంత్ పన్నాగం ఇది. మేం తప్పు చేయలేదు, ఎవరికి భయపడేది లేదు. కేటీఆర్ గారు దైర్యంగా వెళ్లారు. అనేక సందర్భాల్లో బిఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం జరిగింది. ఆరోజు ఎందుకు కేసులు పెట్టలేదు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీస్తే, కేటీఆర్ గారి మీద సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో వార్థుల రాయిస్తే ఏం చేసారు. రేవంత్ రెడ్డి మీద కూడా అధికారులు విచారణ జరిపించాలి. అన్ని విషయాలు బయటకు రావాలి..అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.