హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో వెనుక మతలబు ఉంది, వెయ్యి కోట్లు రూపాయలు చేతులు మారాయి..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఓ పథకం ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి ఎల్ అండ్ టీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వెయ్యి కోట్ల రూపాయల లాభం పొందారు. హైదరాబాద్ ప్రజలకు మెట్రో అందుబాటులో లేకుండా చేస్తున్నారు. రూ.35 వేల కోట్ల ఆస్తులను అదానీ, మెగాకి కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. మరో వెయ్యి కోట్ల రూపాయల కోసం ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తోంది. ఇల్లు లేని దగ్గర రోడ్డు వేస్తున్నారు. తెలంగాణ ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారు..అని జగదీష్‌రెడ్డి అన్నారు.