హైడ్రా పేరుతో ద్వేష రాజకీయాలు ఆపేయాలి..సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ఫైర్

అనుమతులు ఉన్న వాటిని కూడా హైడ్రా పేరుతో కూలగొట్టి కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా ద్వేష రాజకీయాలు ఆపేయాలని హరీష్ రావు సూచించారు.

By Knakam Karthik  Published on  2 Feb 2025 7:10 PM IST
Telangana, Hydra, HarishRao, Cm Revanth reddy, Congress, Brs,

హైడ్రా పేరుతో ద్వేష రాజకీయాలు ఆపేయాలి..సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ఫైర్

హైదరాబాద్‌లోని కొంపల్లిలో రియల్టర్ వేణుగోపాల్‌ రెడ్డిది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య... అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. యువ బిల్డర్ 39 ఏళ్లకే చనిపోవడం, అది కూడా ప్రభుత్వ కారణంగానే సూసైడ్ చేసుకుంటున్నాని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. చేనేత కార్మికులు, రైతులు, బిల్డర్లు, ఆటో డ్రైవర్లు.. ఇలా అన్ని వర్గాల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డికి సోయి రావట్లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టే వారు కూడా భయంతో వెనక్కి వెళ్లిపోతున్నారని చెప్పారు. అనుమతులు ఉన్న వాటిని కూడా హైడ్రా పేరుతో కూలగొట్టి కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా ద్వేష రాజకీయాలు ఆపేయాలని హరీష్ రావు సూచించారు.

Next Story