వారు చనిపోవడానికి కారణం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: హరీశ్‌రావు
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
By - Knakam Karthik |
హైదరాబాద్: వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆదివారం సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డివిజన్‌లోని కస్తూర్బానగర్‌లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వరద ముంపునకు గురైన 1500 కుటుంబాలకు హరీశ్ రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ...ప్రీ మాన్ సూన్ ముందు నాలాలన్నీ క్లీన్ చేయాలి. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాలాలన్నీ క్లీన్ చేయించేవారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల నాళాల నుండి వరద వచ్చింది. ఈ వరద వల్ల ఇంట్లో ఉన్నటువంటి నిత్యవసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయి. ముఖ్యమంత్రి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఒక్క రూపాయి సహాయం కూడా వరద బాధితులకు చేయలేదు. హైదరాబాద్ నగరంలో 7 , 8 మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయారు. వారు చనిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం...అని కీలక వ్యాఖ్యలు చేశారు.
గుంతలు పూడ్చే తెలివి లేదు గాని ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఉన్న సిటీలో నాలాలు బాగా చెయ్. రోడ్లు బాగా చెయ్. పోర్టు సిటీ కాంట్రాక్టర్ల కోసం ఆరాటం చేస్తున్నాడు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట... ఇంతకంటే బరితెగింపు మాటలు ఉంటాయా..పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేమే పార్టీ మారినమని ట్విట్టర్ లో పెట్టుకున్నరు.. పదిమందిని పార్టీలో చేర్చుకున్నామని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించాడు.. మీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజం సమీక్షలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీకి కనిపిస్తడు.. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని సిగ్గు లేకుండా చెబుతున్నాడు.. ప్రజలు అన్ని గమనిస్తున్నారు సరైన సమయంలో మీకు బుద్ధి చెబుతారు.. రాష్ట్రంలో ఎక్కడైతే వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయం అందించాలి. బతుకమ్మ పండుగ వచ్చింది పండుగ పూట వీధి దీపాలైనా వెలిగేటట్టు చూడు. రాష్ట్ర ప్రజలందరికీ, అక్క చెల్లెలు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. పల్లెటూర్లలో గ్రామాల్లో కేసీఆర్ ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు. బతుకమ్మ ఘాట్లు కట్టించాడు పండుగను అద్భుతంగా జరిపించుకోవడానికి ఫ్లడ్లైట్లు, రోడ్లు, సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈరోజు బతుకమ్మకి రేవంత్ రెడ్డి ఒక రూపాయి ఇవ్వలేదు..లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. పండుగ పూట చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి లేదు.. ఈ పండుగ పూటైనా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేసి అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను జరుపుకునేటట్టు చెయ్. నీ రెండు సంవత్సరాల పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారాయి.. వరదల్లో మునిగి పోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారం అందించు..వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యవసర వస్తువులను అందించు..అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.