ఆ ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది

రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్లు కేటీఆర్ మానుకోటలో ధర్నా చేసిండు.. కేటీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల ప్రాణాలను హింశించిన కాలాంతకులు అని మాజీ ఎమ్మెల్యే, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ విమ‌ర్శించారు.

By Kalasani Durgapraveen  Published on  26 Nov 2024 2:15 PM IST
ఆ ఆత్మ‌హ‌త్య‌ల‌పై కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది

రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్లు కేటీఆర్ మానుకోటలో ధర్నా చేసిండు.. కేటీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల ప్రాణాలను హింశించిన కాలాంతకులు అని మాజీ ఎమ్మెల్యే, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ విమ‌ర్శించారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మీరు చేసిన పాపాలు, ఆక్రోశాలు, మోసాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. 2021లో ఉద్యోగం రాదు అని 14 మంది నిరుద్యోగ యువకులు చనిపోయారు.. దానికి నిదర్శనం షబ్బీర్ అనే నిరుద్యోగి సూసైడ్ నోట్.. మీలాంటి మోసం చేసిన వ్యక్తులను చంపాలని నిరుద్యోగులు అనుకున్నారు.. మీకు సెక్యూరిటీ లేకుంటే నిరుద్యోగులు మిమ్మల్ని చంపేవారన్నారు.

సిరిసిల్లలో ఇసుక లారీలను ఆపి వ్యక్తులను లారీలతో తొక్కి చంపిన చరిత్ర మీది.. ఖమ్మంలో మిర్చికి మద్దతు ధర ఇవ్వమని రైతులు అడిగితే వాళ్ళను వాళ్లకు సంకెళ్లు వేసి రోడ్ల మీద ఈడ్చుకెళ్లిన సంఘటన ఇంకా ఖమ్మం రైతులు మర్చిపోలేదన్నారు. ఎంత మంది దళితులు, నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యామో ఇంట్లో కూర్చోని కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదన్నారు. అదానీని దావోస్‌లో నువ్వు కలిసి ఒప్పందాలు చేసుకొంటే నైతికం.. మేము కలిసి ఒప్పందం చేసుకుంటే అనైతికమా.. నీ ప్రభుత్వంలో అదానీతో ఒప్పందం జరిగిన మాట వాస్తవం కాదా.? అని ప్ర‌శ్నించారు. దేశ వ్యాప్తంగా అదానీపై ఆరోపణలు వస్తున్నాయ‌ని తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల ఒప్పందం రద్దు చేసుకుందని తెలిపారు.

Next Story