కేటీఆర్‌కు మ‌రో షాక్‌.. కేసు న‌మోదు చేసిన ఈడీ

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేయగా.. నేడు ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.

By Medi Samrat  Published on  20 Dec 2024 9:26 PM IST
కేటీఆర్‌కు మ‌రో షాక్‌.. కేసు న‌మోదు చేసిన ఈడీ

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేయగా.. నేడు ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు. ఇందులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజీనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. గురువారం ఏసీబీ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్ల కాపీలు ఇవ్వాలని నేడు ఏసీబీని కోరిన‌ ఈడీ కేసు న‌మోదు చేసింది. ఇక‌ ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 30 వరకు కేటీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది.

Next Story